ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరదనీరు.. గేట్లు ఎత్తనున్న అధికారులు

  • ఈరోజు అర్ధరాత్రి తర్వాత బ్యారేజ్ గేట్లు ఎత్తనున్న అధికారులు
  • 4,500 నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం
  • దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈరోజు అర్ధరాత్రి తర్వాత బ్యారేజ్ గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న కృష్ణా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా, 4,500 నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. పట్టిసీమ, పులిచింతల ప్రాజెక్టుల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని మునేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి చేరే వరద నీటి ప్రవాహం పెరిగింది.
Go Back to Shorts
Vijayawada
prakasam barrage

More Telugu News